Posts

Showing posts from August, 2019

ఓల్గా

తెలుగు సాహిత్యం పై మాట్లాడాలనుకుంటే ఎక్కువ శ్రమ అవసరం ఉండదు. ఎంచుకోవడం తేలిక. తెలుగు రచయిత్రుల గురించి మాట్లాడాలనుకుంటే మాత్రం అంత సులభం కాదు. ఎందుకంటే, ఎంచుకునేందుకు మనకి అందుబాటులో ఉన్న పేర్లు చాలా పరిమితమైనవి. ఈ విషయం నాకూ ఈ మధ్యనే అర్థమైంది, ఈ వేదిక కోసం కసరత్తు ప్రారంభించిన తరువాత. ఇందులోని హాస్య కోణాన్ని చూడగలిగితే అది క్రీడా స్ఫూర్తి అవుతుంది. దీని మూలాలను వెతికి పట్టుకోగలిగితే ఇందులో ఒక సామాజిక పాఠం దొరుకుతుంది. రచయిత్రులు అల్ప సంఖ్య లో ఉండడానికి కారణం దక్షత లోపమా లేక దాష్టీకమా అనే ప్రశ్నకు సమాధానం కోసం పెద్ద మేధో మధనం అవసరం లేదు. ఇది అందరికీ అర్థమయ్యే విషయమే. ఈ వేదిక ఉద్దేశ్యాల నేపథ్యంలో ఇప్పటి వరకు నేను ప్రస్తావించిన పురుషాధిక్య సమాజం వగైరా విషయాలు అసందర్భమేమో అనే సందేహం మీలో కలిగే ఆస్కారం ఉంది.   కానీ సందర్భం ఉంది. ఇది 2019వ సంవత్సరం. మనం ఇప్పుడు అనుకున్న మాట ఈ రోజు సంగతి. మరి 2019 లో పరిస్థితి ఇలా ఉంటే, మూడు, నాలుగు దశాబ్దాల క్రితం పరిస్థితి ఎలా ఉండి ఉంటుంది? ఆ పరిస్థితిని ఊహిస్తే, అప్పటి రచయిత్రులు ఎటువంటి సవాళ్లు ఎదుర్కొని ఉంటారు? ఆ సవాళ్ళ నేపథ్యం లో ఎటువంటి ఇతివృత్తా