Posts

Showing posts from October, 2019

మా భూమి

ఈ రోజు మీతో నా ఆలోచనలు పంచుకునేందుకు నేను ఎంచుకున్న నాటకం ‘మా భూమి’. మా భూమి – ఆ పేరు చెప్తుంటే నాకు సంతోషం, గగుర్పాటు, గర్వం ఒకేసారి కలుగుతున్నాయి. ‘బండెనక బండి కట్టి, పదహారు బళ్ళు కట్టి’ అన్న పాట వినిపిస్తే ఇవాల్టికీ తెలంగాణ బిడ్డల రక్తం ఉప్పొంగుతుంది. 1946 లో, అంటే 73 ఏళ్ళ క్రితం పుట్టిన రెండున్నర గంటల నాటకం నేటికీ సజీవంగా ఉండడం మామూలు విషయం కాదు. ఒక ఇతివృత్తాన్ని సామాన్యుడు own చేసుకున్నపుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. మరో కారణం ఏమిటంటే అందులో ప్రస్తావించబడిన సామాజిక సమస్యలు కూడా ఇప్పటికీ సజీవం గానే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తం గా ప్రజా పోరాటాలకు చిరునామా 20వ శతాబ్దం, ఆ పోరాట గాథల్లో నేటికీ స్ఫూర్తి గా నిలిచే కథల్లో ఒకటి తెలంగాణ లో నిజాం నిరంకుశ పాలన కు వ్యతిరేకం గా రైతు కూలీలు చేసిన వీరోచితమైన తిరుగుబాటు. సంఘే శక్తి: అనే సూక్తిని నిరూపించే కథ. చే గవెరా గెరిల్లా పోరాటానికి, అల్లూరి సీతారామరాజు రంపా విప్లవానికి ఏ మాత్రం తీసిపోని వీర గాథ. దురదృష్టవశాత్తు చరిత్ర లోని ఈ పుటలకు రావలసినంత గుర్తింపు రాలేదు. మా భూమి తెలంగాణ రైతాంగ ఉద్యమం నాటి పరిస్థితులను ప్రతిబింబించే కథ మాత్రమే కాదు, ప్ర