Posts

Showing posts from September, 2019

విముక్త

విముక్త కథలు చదువుతూంటే నాకు ఒక ఐన్ స్టీన్ కోట్ గుర్తొచ్చింది: We cannot solve problems by applying the same kind of thinking that we used when we created them అని ఆయన హెచ్చరిక. ఏ ఆలోచనా విధానం సమస్యలకు కారణమవుతోందో, దానిని సమూలంగా మార్చుకోనంత కాలం ఆ సమస్యలు అలాగే ఉంటాయి, అదే ధోరణిని ఉపయోగించి పరిష్కారాలు వెతకాలనుకోవడం అమాయకత్వమే కాదు, మూర్ఖత్వం కూడా. ఓల్గా రాసిన కథలు చదువుతున్నప్పుడు, అందులోని పాత్రలు నన్ను పరధ్యానం లో పడేశాయి, నిద్రలో కూడా వెంటాడాయి, నాలో నాకు అనేకానేక ప్రశ్నలు పరంపరలా వచ్చిపడ్డాయి. విముక్త లాంటి రచనలు అవసరమా? ఇవి చదవాలా? ఇవి అందరి కోసమా, కొందరి కోసమా? ఇవి మేధావి వర్గాన్ని మాత్రమే ఉద్దేశించినవా లేక అమాయకులని మేలుకొలిపేవా? ఈ రచనల లక్ష్యం ఏమిటి? ప్రయోజనం ఏమిటి? చదివే ఉద్దేశ్యం ఏమిటి – ఇవి కాలక్షేపం కోసమా, పాండితీ ప్రదర్శన కోసమా, చర్చ కోసమా, విప్లవం కోసమా? విముక్త తత్త్వం నాకు పూర్తిగా బోధ పడిందని నేనంటే అది అబద్ధమైనా అయి ఉండాలి, లేదా అతిశయోక్తి అయినా అయి ఉండాలి, ఈ రెండూ కాకపోతే అపరిపక్వత తో కూడిన ఒక అపోహ అయినా అయిఉండాలి, ఎందుకంటే, ఒక వేళ నాకా తత్త్వం ని